
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఓట్లు వేశారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా క్యూలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకోవడం దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలంగా ఉంటుంది.. ఎవరికి ప్రతికూలంగా మారుతుంది.. అనేది పక్కన పెడితే.. ఏపీలో తుది పోలింగ్ శాతం వివరాలను సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం అత్యధిక పోలింగ్ జరిగినట్లు ప్రకటించారు. అత్యధిక పోలింగ్ నమోదు కావడంతో తమ లక్ష్యం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం పోలింగ్ శాతంలో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ జరిగినట్లు వివరించారు.
నాలుగో దశలో పోలింగ్ జరిగిన ఏ రాష్ట్రంలోనూ ఈస్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంకే మీనా తుది పోలింగ్ శాతం వివరాలు వెల్లడించారు. 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిందని, ఆఖరి పోలింగ్ స్టేషన్ లో అర్దరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగడం గమనార్హం అన్నారు. పోలింగ్ శాతం పెంపులో తమ లక్ష్యం నెరవేరిందన్నారు. వర్షం వల్ల కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైనట్లు తెలిపారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 79.77 శాతం నమోదైనట్లు ఎంకే మీనా తెలిపారు. పోలింగ్ రోజున నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని, రెండు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 పోలింగ్ శాతం నమోదుకాగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా వివరించారు, న్నారు. కుప్పంలో 89.88, ప్రకాశం, చిత్తూరులో 87.09 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా విశాఖలో శాతం 71.11 పోలింగ్ నమోదైంది. అసెంబ్లీకి ఓటేసిన వారిలో కొందరు లోక్‌సభకు ఓటు వేయలేదని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3,33,40,333 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, పార్లమెంట్ ఎన్నికల్లో 3,33,4,560 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 350 స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంచామని, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY