ఎన్నికలవేళ ఫిరాయింపులు జరగడం అనేది సాధారణ ప్రక్రియ. ఎన్నికల ముందు టికెట్ దక్కక.. అనుకున్న చోట టికెట్ ఇవ్వలదేని కొందరు నేతలు పార్టీ ఫిరాయిస్తుంటారు. అదే ఫలితాలు వెలువడ్డాక అధికార పక్షంలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుంటారు. గెలిచిన పార్టీ కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. దాదాపు అన్ని చోట్ల ఇదే ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఏపీలో కూడా ఈ ప్రక్రియ మొదలవడంతో.. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 11 అసెంబ్లీ స్థానాలు.. 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
దీంతో ఉన్న 11 ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను అయినా కాపాడుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారట. అందుకే వరుసగా తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ సమావేశమవుతున్నారు. వారికి తగు భరోసా కల్పిస్తున్నారు. అయినప్పటికీ నప్పటికి కూడా కొందరు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారని.. అధికారపక్షంలోకి జంప్ అవ్వబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అరకు వైసీపీ ఎంపీ చెట్టి తనూజారాణి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తనూజారాణి బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.
అరకు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. గత ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ తరుపున కొత్తపల్లి గీత పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ తరుపున చెట్టి తనూజారాణి.. బీజేపీ నుంచి కొత్తపల్లి గీత పోటీ చేశారు. తనూజారాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండడం.. ఆమెకు పెద్దగా బ్యాక్ గ్రౌండ్ కూడా లేకపోవడంతో బీజేపీ అభ్యర్థి గీతనే గెలుస్తారని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. కానీ వైసీపీకి అరకులో ఎస్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉంది. ఆ ఓటు బ్యాంక్‌తో తనూజారాణి గెలుపొందారు.
ఇప్పుడు గీతలానే.. తనూజారాణి కూడా పార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారంపై తనూజారాణి స్పందించారు. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే తమ ప్రయాణం అని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో తనూజారాణి పార్టీ మారబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లు అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE