ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీని ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వారు మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ.. వారికి శాఖలను కేటాయించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అలాగే మంత్రులకు కేటాయించబోయే శాఖలకు సంబంధించి పలు ఊహాగాణాలు వెలువడ్డాయి.
తాజాగా ఉత్కంఠకు, ఊహాగాణాలకు ఎండ్ కార్డ్ పడింది. చంద్రబాబు నాయుడు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. శుక్రవారం మధ్యాహ్నం 02:15 గంటలకు మంత్రులకు కేటాయించిన శాఖలను ప్రకటించారు. అందులో కీలకమైన శాఖలను జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ శాఖను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు. నారా లోకేష్‌కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు
గత కొద్దిరోజులుగా హోం శాఖ ఎవరికి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌కే హోం శాఖను కూటాయిస్తారని కూడా గుసగుసలు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా హోం శాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను.. నాదెండ్ల మనోహర్‌కు ఆహారం, పౌరసరఫరాల శాఖలను.. పొంగూరు నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు.
సత్యకుమార్ యాదవ్‌కు ఆరోగ్యశాఖను.. నిమ్మల రామానాయుడుకు నీటిపారుదల శాఖ.. మహ్మద్ ఫరూఖ్‌కు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖలను.. ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖను.. పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖను.. అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ శాఖను.. కొలుసు పార్థసారథికి హౌసింగ్, ఐ అండ్ పీఆర్ శాఖలను.. డోలా బాలవీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమ శాఖను.. గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖను.. కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సాంస్కృతిక శాఖలను.. గుమ్మడి సంధ్యారాణికి స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలను.. బీసీ జనార్థన్‌కు రహదారులు, భవనాల శాఖలను.. టీజీ భరత్‌కు పరిశ్రమల శాఖను.. ఎస్.సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖలను.. వాసంశెట్టి సుభాష్‌కు కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖను.. కొండపల్లి శ్రీనివాస్‌కు MSME, సెర్ప్, NRI ఎంపర్‌పమెంట్ శాఖలను.. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి రవాణా, యువజన, క్రీడా శాఖలను చంద్రబాబు నాయుడు కేటాయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE