పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయనే హాట్ టాపిక్. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో పాటు బాధ్యతలను బుజాన మోస్తూ కూటమిని విజయతీరాలకు చేర్చారు. అయితే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ముందు నుంచి కూడా పలు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కొందరు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని.. మరికొందరు దుండగులు తమ కార్యకర్తల్లో కలిసిపోయి తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలుమార్లు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ముందు నుంచి కూడా అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్‌కు ప్రధాన్యత ఇస్తున్న చంద్రబాబు నాయుడు.. తన భద్రతపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయన భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే ప్రొటోకాల్ విషయంలో తనతో సమానంగా పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఆయన భద్రతను పెంచారు. పవన్‌కు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ఫ్రూఫ్ కారును కేటాయించారు. ఇక నుంచి పవన్ కాన్వాయ్‌లో ఒక ఎస్పీజీ కమాండో, రెండు ఎన్ఎస్‌జీ కమాండోలతో కూడిన కార్లు ఉండనున్నాయి. వీటితో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన కార్లు, ఒక జామర్ వెహికల్ పవన్ కాన్వాయ్‌లో ఉండనుంది.
ఇకపోతే ఏపీలో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్‌కు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. ఇప్పటికే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖలను పవన్‌కు కేటాయించారు ఈనెల 19న పవన్ సచివాలయంలో తన బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికే సచివాలయంలోని సెకండ్ బ్లాక్‌లో పవన్ చాంబర్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో పవన్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE








































