ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్కు పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తూ ముందుకువెళుతున్నారు. వైసీపీ నేతలకు పాలన అంటే ఇలా ఉండాలని చెబుతూనే..అభివృద్ధిపైన ఫోకస్ పెంచుతున్నారు. ఈ రెండు నెలల్లోనే ఏపీని గాడిన పెట్టడానికి చేయవలసిన పనులన్నీ చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగాంగానే తిరుపతిలో ఒకే రోజు 15 కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు.. పలు కొత్త సంస్థలకు శంకుస్థాపన చేయడానికి సీఎం చంద్రబాబు రంగం సిద్దం చేసుకున్నారు.
తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజక వర్గంలోని శ్రీసిటీలో ఈ రోజు సీఎం చంద్రబాబు పలు సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. శ్రీసిటీలో రూ. 900 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న కంపెనీల్లో సుమారు 2,700 మందికి ఉపాధి కల్పించడానికి రంగం సిద్దమయ్యింది. కొన్ని కంపెనీలకు చెందిన సీఈవోలతో ఇటీవల చంద్రబాబు చర్చలు జరిపి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమ, జపాన్‌కు చెందిన నైడిక్, బెల్జియంకు చెందిన వేర్మియర్, ఇజ్రాయల్‌కు చెందిన లనియోలింక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, దక్షణి కొరియాకు చెందిన ఎల్జీకెమ్ కంపెనీలతో పాటు.. భారత్‌కు చెందిన అడ్త్మర్, ఆటోడేటా, బాంబే కోటెడ్ స్పెషలల్ స్టీల్స్, ఈప్యాక్, జేజీఐ, త్రినాథ్‌తో పాటు సింగపూర్, యూఏఈ, జపాన్‌కు చెందిన కొన్ని కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలోని కొన్ని కంపెనీల యాజమాన్యంతో సీఎం చంద్రబాబుకి పాత పరిచయాలున్నాయి. ఆ పరిశ్రమల యజమాన్యం సహకారంతో కొత్త ఇండస్ట్రీలను తీసుకురావడానికి సీఎం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఇదేనని.. అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితే పెట్టుబడి పెట్టే కంపెనీలు ఇంకా వస్తాయని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. జలాశయ మరమ్మతు పనులతో సీఎం సీఎం సమీక్షించనున్నారు.