పవన్ అడ్జస్ట్‌మెంట్లతో అడ్జెస్ట్ అవ్వాల్సిందేనా?

Nagababu, Nagababu does not have Anakapalli seat,Pawan's adjustments?,Gorantla Buchayya Chowdary, Kandhula Durgesh, Pawan Kalyan, Chadrababu, TDP, Janasena,AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Nagababu, Nagababu does not have Anakapalli seat,Pawan's adjustments?,Gorantla Buchayya Chowdary, Kandhula Durgesh, Pawan Kalyan, Chadrababu, TDP, Janasena

కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని వినిపిస్తున్న ప్రచారానికి తాజాగా తెర పడినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకూ జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉండే నాగబాబు.. కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఇదే నిజమన్న వాదన వినిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో పర్యటనలు చేయడంతో పాటు..స్థానిక నేత అనిపించుకోవడానికి ఎలమంచలిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న నాగబాబు…ఇప్పుడు ఉన్నపళంగా  ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్,  ఇతర సామాగ్రిని కూడా తరలించినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయడం లేదన్న ప్రచారం ఊపందుకోవడంతో పాటు.. తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

జనసేనతో టీడీపీ పొత్తు కుదరడంతో.. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. 24 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంటు స్థానాలను జనసేనకు చంద్రబాబు కేటాయించారు. ఐదుగురు జనసేన అభ్యర్థులను ప్రకటించిన పవన్.. 19 మందిని పెండింగ్ లో పెట్టారు.  లోక్ సభ స్థానాలకు సంబంధించి అనకాపల్లి, మచిలీపట్నం,కాకినాడ స్థానాలు జనసేనకు కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ టికెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన బాలశౌరికి, కాకినాడ సీటును సానా సతీష్ కు కేటాయించినట్లు తెలుస్తోంది.  అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరగడం.. నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎలమంచిలిలో 15 రోజుల క్రితం ఇంటిని అద్దెకు  తీసుకుని..స్థానిక టీడీపీ జనసేన నాయకులతో సమన్వయం  చేసుకుంటూ వచ్చారు.కానీ ఏం జరిగిందో తెలియదు కానీ   ఉన్నట్టుండి నాగబాబు కొద్ది రోజులుగా కనిపించకుండా పోయారు.

టీడీపీ, జనసేన పొత్తుతో రెండు  పార్టీలకు లాభం ఎంతుందో తెలియదు కానీ .. రకరకాల వివాదాలు, కొన్ని నియోజకవర్గాల విషయంలో గొడవలు  జరగడం రెండు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. ఇలా అనకాపల్లి సీటు విషయంలో పవన్‌ను చంద్రబాబు సర్ధుకుపోవాలని సూచించడంతోనే నాగబాబు అక్కడ కనిపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.  కీలకమైన అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని వదులుకోవడం టీడీపీకి ఇష్టం లేదు. రాజమండ్రి రూరల్ విషయంలో బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్ విషయంలో కూడా ఇటువంటి వివాదమే నెలకొంది.  చంద్రబాబు ఒత్తిడితో పవన్ నాగబాబును తప్పించి.. వేరే నియోజకవర్గానికి పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో.. సీట్ల సర్దుబాటు ప్రక్రియ అంతా చంద్రబాబు కనుసనల్లోనే నడుస్తోందన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. పొత్తులో భాగంగా వచ్చిందే తక్కువ సీట్లు అని.. అవి కూడా టీడీపీ కోసం వదులుకుంటే ఎలా అన్న ప్రశ్నలుల జనసేన వర్గంలో వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =