ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం

AP CM's visit to Delhi,Chandrababu's return from Delhi,AP CM Chandrababu, Amit Shah, Nirmala Sitharaman, PM Modi
Chandrababu'S Return Journey From Delhi,Return Journey From Delhi,Chandrababu, Amit Shah, AP CM Chandrababu, AP CM's Visit To Delhi, Chandrababu'S Return From Delhi, Nirmala Sitharaman, PM Modi,Live Updates,Politics,Political News, Mango News, Mango News Telugu

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7గంటలకు ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఢిల్లీలో ఈ రోజు  మరి కొంతమంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు  కలుస్తారని ముందుగా ప్రచారం జరిగింది.

ప్రధానంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై..రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతారని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రారంభంలో ఏపీ ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలను కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని  కోరే అవకాశాలున్నాయని అన్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను  కూడా కలిసి.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ జాప్యానికి అడ్డుగా ఉంటున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రప్రభుత్వం వేగంగా పరిష్కరించాలని చంద్రబాబు కోరతారనే వార్తలు ముందుగా వినిపించాయి.

అయితే, హస్తినలో ఏపీ చంద్రబాబు.. ఇతర కేంద్ర మంత్రులను కలవకుండానే.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.అంతకంటే ముందు ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన 1, జనపధ్ పూజలు నిర్వహించారు సీఎం చంద్రబాబు. కాగా, మంగళవారం  ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు.. రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాలని  కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. అలాగే జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఏపీకి ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం వేగంగా పరిష్కరించాలని కోరారు.

పోలవరం నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ ఖజానా నుంచి ముందుగా పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలో ఉన్న పలు పెండింగ్ అంశాలను కూడా వెంటనే  పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర హోం మంత్రిత్వశాఖదేనని ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసినట్లుగా తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE