ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. పదవుల విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా చూడకుండా అర్హత ఉన్నవారికి కేటాయిస్తున్నారు. తన కేబినెట్‌లోకి కూడా చంద్రబాబు 17 మందిని కొత్తవారినే తీసుకున్నారు. తాజాగా లోక్ సభలో టీడీపీకి విప్‌గా అలాపురం ఎంపీ, యువ నాయకుడు గంటి హరీష్ మాథుర్‌ను చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. మాజీ స్పీకర్ గంటి మోహననంద్రబాలయోగి తనయుడే హరీష్ మాథుర్. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ తన తండ్రి చేసిన సేవలకు గుర్తుగా హరీషకు విప్ పదవిని చంద్రబాబు కేటాయించారు.
వాజపేయి హయాంలో గంటి మోహనచంద్రబాలయోగి స్పీకర్‌గా పనిచేశారు. వాస్తవానికి ఆ సమయంలో ఆయనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావు. అయినప్పటికీ ట్యూషన్ పెట్టించుకొని తన పనితీరును మెరుగు పరుచుకున్నారు. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు హెలికాప్టర్ ప్రమాదంలో మోహనచంద్రబాలయోగి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2014లో ఆయన తనయుడు గంటి హరీష్ మాథుర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో హరీష్‌కు చంద్రబాబు నాయుడు అమలాపురం ఎంపీ టికెట్ కేటాయించారు. కానీ ఆ ఎన్నికల్లో హరీష్ మాథుర్ ఓటమిని చవిచూశారు.
కానీ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొంది.. ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఐటీడీపీ నాయకుడిగా.. అమలాపురం టీడీపీ కార్యదర్శిగా హరీష్ మాథుర్ పని చేశారు. అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ టీమ్‌లో చేరి అనతికాలంలో కీలకనాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ఆయనకు అమలాపురం ఎంపీ టికెట్ కేటాయించారు. కానీ ఈసారి కూడా హరీష్ ఓడిపోయారు. అయినప్పటికీ నిరాశ పడకుండా.. టీడీపీలనే కొనసాగారు.
2019 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తమ పార్టీలో చేరాలని హరీష్ మాథుర్‌కు వైసీపీ ఆహ్వానం కూడా పంపించింది. కానీ దానిని కాదని ఆయన టీడీపీ పట్టునే ఉన్నారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి హరీష్ మథూర్‌కు చంద్రబాబు నాయుడు అమలాపురం ఎంపీ టికెట్ కేటాయించారు. రెండుసార్లు ఓటమిని చవిచూసిన హరీష్ ఈసారి మూడు లకలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈక్రమంలో హరీష్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని కొద్దిరోజుల పాటు ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి దక్కకపోవడంతో.. పార్లమెంట్‌లో పార్టీ విప్‌గా హరీష్ మాథుర్‌ను చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY