ఏపీ ప్రభుత్వం‌ కీలక నిర్ణయం, 53 మంది మహిళా ఖైదీల ముందస్తు విడుదలకు ఉత్తర్వులు

AP Government, AP Government Issued Orders to Release 53 Women Prisoners, AP Government To Release 53 Women Prisoners, AP Govt Decided To Release Women Prisoners, ap women prisoners release, ap women prisoners release news, Mango News Telugu, Orders to Release 53 Women Prisoners, Release Of Women Prisoners, Women Prisoners, women prisoners release in ap

రాష్ట్రంలో మహిళా ఖైదీల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు పడి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీల విడుదలపై మార్గదర్శకాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవిత ఖైదు పడిన 53 మంది మహిళా ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో రాజమండ్రి మహిళా జైలు నుండి 19 మందిని, కడప జైలు నుంచి 27 మందిని, నెల్లూరు నుంచి 5, విశాఖపట్నం నుంచి ఇద్దరిని విడుదల చేయనున్నారు.

అలాగే మహిళా ఖైదీల విడుదలపై ఏపీ ప్రభుత్వం‌ కొన్ని షరతులు కూడా విధించింది. ముందుగా వారు రూ.50 వేల రూపాయల పూచీకత్తుతో బాండ్ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక మిగిలిన శిక్షా సమయం ముగిసేంతవరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్‌కి హాజరు కావాలని పేర్కొన్నారు. విడుదలైన తర్వాత మళ్ళీ ఎలాంటి నేరాలకైనా పాల్పడితే వెంటనే అరెస్ట్ చేయడంతో పాటుగా ముందస్తు విడుదల లబ్దిని కూడా రద్దు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + two =