ఎన్నికలవేళ ఇచ్చిన హామీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికలప్పుడు చెప్పినట్లుగానే గతంలో ఇచ్చే పెన్షన్‌కు అధనంగా వెయ్యి రూపాయలు కలిపి పంపిణీ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన తొలి కార్యక్రమం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
అమరావతి పరిధిలోని పెనుమాక గ్రామానికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు చంద్రబాబు నాయుడు పెన్షన్ అందించారు. పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బానావత్ పాములు నాయక్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్.. అతని కుమార్తెకు వితంతు పెన్షన్ అందించారు. అదే సమయంలో తాము పూరి గుడిసెలో ఉంటున్నామని.. ఇళ్లు కావాలని పాములు నాయక్ చంద్రబాబును కోరారు. వెంటనే స్పందించిన చంద్రబాబు తప్పకుండా ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 15 నిమిషాల పాటు పాములు నాయక్ ఇంట్లో చంద్రబాబు నాయుడు గడిపారు. వారి పిల్లలతో మాట్లాడి వారి చదువుల గురించి ఆరా తీశారు.
గత ప్రభుత్వం వృద్ధులకు రూ. 3 వేలు పింఛన్ అందించింది. ఎన్నిలకప్పుడు తాము అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చారు. పెంచిన పెన్షన్ మొత్తం ఏప్రిల్ 1 నుంచి అమలయింది. మొత్తం రూ. 7 వేల పెన్షన్‌ను లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మంది వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షణ్ అందజేస్తున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మంచానికే పరిమితమయిన వారికి గత ప్రభుత్వం రూ. 5 వేల పెన్షన్ అందించింది. కానీ టీడీపీ ప్రభుత్వం దానికి రూ. 15 వేలు అందిస్తోంది. అలాగే కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడుతున్నవారికి గత ప్రభుత్వం పింఛన్ రూ. 5 వేల ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ