ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్.. జైలు ఎదుటే పొత్తున ఖరారు చేశారు. అప్పటి నుంచి కూటమి గెలుపుకోసం ఎంతగానో కష్టపడ్డారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున శ్రమించారు. అందుకే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవిని.. నాలుగు శాఖలను చంద్రబాబు కేటాయించారు. అలాగే జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకున్నారు.
ఈక్రమంలో చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మరో పదవిని జనసేనకు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఎంతో కీలకమైనది. ఆ పోస్టును జనసేనకు చెందిన లీగల్ వ్యవహారాల సలహాదారు సాంబశివ ప్రతాకు చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఈ మేరకు ఏఏజీగా సాంబశివ ప్రతాప్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంబశివ ప్రతాప్ పదేళ్లుగా జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆయనకు హైకోర్టులో సుదీర్ఘ ప్రాక్టీసు అనుభవం ఉంది. ఈక్రమంలో ఆయనకు ఏఏజీ పోస్టును కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందని భావించి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక పోతే ఇటీవల శాసన మండలిలో కూడా జనసేనకు చంద్రబాబు నాయుడు స్థానం కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల శాసన మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాల కోసం టీడీపీకి చెందిన ఎంతో మంది లీడర్లు పోటీ పడ్డారు. తమకే కేటాయించాలని పట్టుపట్టారు. అంతేకాకుండా పార్టీ సీనియర్ లీడర్లు కూడా తమ పార్టీకి చెందిన వారికే రెండు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని పట్టుపట్టారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్నవారిని ఈ విధంగానైనా సంతృప్తి పరచవచ్చని చంద్రబాబుకు సూచించారు. కానీ చంద్రబాబు అలా చేయకుండా.. ఓ పదవిని జనసేనకు కేటాయించారు. ఇలా ప్రతీ అంశంలోనూ జనసేనకు చంద్రబాబు నాయుడు తగిన ప్రధాన్యత కల్పిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE