పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్, జూలై 31న తదుపరి జనవాణి కార్యక్రమం – నాదెండ్ల మనోహర్

Next Janavani Event to be Held on July 31st Venue Details Revealed Soon - Nadendla Manohar, Nadendla Manohar Says Next Janavani Event to be Held on July 31st Venue Details Revealed Soon, Next Janavani Event to be Held on July 31st Venue Details Revealed Soon, Next Janavani Event to be Held on July 31st, Venue Details Revealed Soon, Next Janavani Event, Janavani Event to be Held on July 31st, Janavani Event, Jana Sena Party Political Affairs Committee chairman Nadendla Manohar, JSP Political Affairs Committee chairman Nadendla Manohar, Jana Sena Party Political Affairs Committee chairman, JSP PACC Nadendla Manohar, Nadendla Manohar, Janavani Event News, Janavani Event Latest News, Janavani Event Latest Updates, Janavani Event Live Updates, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ఒక వారం వాయిదా పడిందని పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం వైరల్ జ్వరానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ తో పాటుగా కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారు. అందువల్ల వచ్చే ఆదివారం అంటే జూలై 24న కాకుండా జూలై 31వ తేదీన జనవాణి జరుగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థలం, వేదిక వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఇప్పటికే విజయవాడ, భీమవరంలలో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయని నాదెండ్ల మనోహర్ అన్నారు.

సమస్యలతో సతమతం అవుతున్న బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, సామాన్యుడి గళం వినబడేలా జనసేన పార్టీ జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై 3 నుంచి వరుసగా వచ్చే ఐదు ఆదివారాల్లో జనవాణి నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ముందుగా జూలై 3 (ఆదివారం), జూలై 10 (ఆదివారం) తేదీల్లో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 17న భీమవరంలో జరగగా, ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరానికి గురికావడంతో జూలై 24, ఆదివారం జరగాల్సిన జనవాణి కార్యక్రమం వాయిదా పడిందని, తదుపరిగా జూలై 31న ఈ కార్యక్రమం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + one =