ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త.. ఇదే మా విధానం – సీఎం చంద్రబాబు

CM Chandrababu Launched 50 MSME Parks and 38 Industries Across AP Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఆయన పర్యటించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.

పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు..

పెట్టుబడుల రాక: ప్రభుత్వంపై విశ్వాసంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయని సీఎం తెలిపారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల పండుగ కనిపిస్తోందని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త’ కార్యక్రమం అమలులో భాగంగా కనిగిరిలోని పెదఈర్లపాడు ఎంఎస్ఎంఈతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు.

యువతకు విస్తృత అవకాశాలు..

గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయని, పారిశ్రామికవేత్తలు పారిపోయారని సీఎం విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ…

“యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు. వారిని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తున్నాం. నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆలోచనతో వస్తే చాలు అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటిస్తున్నాం.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here