ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ పథకం కింద 199.94 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్మును నేరుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని, అందుకే తమ ప్రభుత్వంలో రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మేలు చేయడానికి ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని, దానిద్వారా రైతుల పంటలకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తున్నామని వెల్లడించారు.
2020-21 రబీ సీజన్ మరియు 2021 ఖరీఫ్ సీజన్లకు చెందిన ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ రాయితీ మరియు 2022 ఖరీఫ్ సీజన్ లో వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం రూ.199.94 కోట్లు ఈరోజు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్. ఆర్ధికంగా ఎన్ని రకాల ఇబ్బందులున్నా క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నామని, గత ప్రభుత్వ పనితీరుకి, ఈ ప్రభుత్వ పనితీరుపై తేడా గమనించాలని ఈ సందర్భంగా ఆయన రైతులను కోరారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్ళలో ఇప్పటివరకు 20. లక్షల మందికి రూ.1,795.40 కోట్లు నష్టపరిహారం అందించామని, నేడు అందించే మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834.79 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని వివరించారు. అలాగే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, మున్ముందు వారికోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE