ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా పాజిటివ్ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1312, పశ్చిమగోదావరిలో 1131, చిత్తూరు లో 1103 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 21, ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,940 కు చేరింది. మరో 8827 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,44,045 కి చేరింది. ప్రస్తుతం 87803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3092 కి చేరుకుంది.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 46668
- కర్నూల్ – 37300
- అనంతపూర్ – 33307
- గుంటూరు – 29166
- విశాఖపట్నం – 28813
- పశ్చిమ గోదావరి – 28156
- చిత్తూరు – 27676
- నెల్లూరు – 20433
- కడప – 19536
- శ్రీకాకుళం – 17561
- ప్రకాశం – 14965
- విజయనగరం – 14963
- కృష్ణా – 13501
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu