పిఠాపురంకు ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan Takes Charge AS AP Deputy CM,AP Deputy CM Pawan Kalyan,Janasena,AP Latest News,Mango News,Pawan Kalyan,Pawan Kalyan LIVE,AP Politics,Pawan Kalyan Latest News,Pawan Kalyan Speech,Minister Pawan Kalyan,Pithapuram,Pawan Kalyan News,Janasena Latest News,AP Deputy CM News,AP Deputy CM,Amaravati News,Amaravati,Deputy CM Pawan Kalyan News,Deputy CM Pawan Kalyan,Deputy CM,Janasena Party,Pawan Kalyan Rally,Pawan Kalyan Rally LIVE,AP News LIVE,Mango News, Mango News Telugu
Pithapuram,AP Deputy CM Pawan Kalyan for Pithapuram,Pawan Kalyan,TDP, YCP, Chandrababu,Janasena,

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. అధికార  పక్షాన్ని అఖండ విజయంతో కూలగొట్టి కూటమి గద్దె నెక్కింది. వైసీపీ నేతలు కూడా ఇద్దరు, ముగ్గుర తప్ప మీడియా ముందుకు రావడానికి.. ప్రజా తీర్పుపై స్పందించడానికి  కూడా ఎవరూ ఇష్టపడలేదు.  ఇక అంతా సద్దుమణిగాయి అని కూటమి నేతలు రిలాక్స్ అయ్యేలోగా పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం ఈ రెండు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్న పిఠాపురం తెలుగు దేశం పార్టీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ వర్మపై వన్నెపూడిలో జనసేన కార్యకర్తల దాడి చేయడం అప్పట్లో  కూటమి నేతలను ఆందోళనలో పడేసింది. అంతేకాదు ఆ మర్నాడు తాటిపర్తిలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. కానీ వర్మ దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నించడంతో కాస్త సద్ధుమణిగినా.. ఇంకా ఆ అసంతృప్తులు చల్లారలేదు.

ఆ గొడవలపై స్పందించిన వర్మ.. అసలైన జనసైనికులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఎలాంటి వివాదం లేదని,అయితే తెలుగు దేశం పార్టీ  నుంచి బహిష్కరించిన కొంత మంది  జనసేనలో చేరి ఇప్పుడు అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు.  అయితే వీరికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అండదండలున్నాయని వర్మ ఆరోపించడం హాట్ టాపిక్ అయింది. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ..ఈనెల 20న పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని..ఆయనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారంటూ సమాధానమిచ్చారు.

ఇటు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్.. మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గ కూర్పులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను  కూడా పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు.

డిప్యూటీ సీఎంగా ఈ రోజు విజయవాడలో పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. రేపు అంటే జూన్  20న పిఠాపురంలో పర్యటించబోతున్నారు.  తనకు అఖండ మెజార్టీని అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని.. ఆ నియోజక వర్గంలో పర్యటిస్తానని  ఇటీవలే పవన్ చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలు ఎవరూ తనను కలవడానికి  ఎక్కడకూ రానక్కరలేదని.. తనే  వచ్చి అందరినీ స్వయంగా కలుస్తానని అన్నారు. ప్రజలను కలిసిన  తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటించడానికి కూడా  ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE