
ఇప్పుడు ఎక్కడ చూసినా.. మొబైల్స్ తెగ వాడేస్తున్నవారే కనిపిస్తున్నారు. ఫస్ట్ లో సిటీల్లో మాత్రమే కనిపించే స్మార్ట్ ఫోన్స్.. ఇప్పుడు పల్లెటూరిలోనూ ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తున్నాయి. అంతేకాదు.. చిన్నాపెద్దా, రాత్రి పగలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ను పిచ్చిపిచ్చిగా వాడుతున్నారు. మనుషులతో మాట్లాడటం మరిచిపోయి.. ఎక్కువగా ఫోన్లతోనే గడిపేస్తున్నారు జనాలు.
ప్రతి చిన్న సమాచారం మొబైల్‌లోనే దొరకడం, కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ ఉండటంతో.. అందరూ వాటికి ఎడిక్ట్ అయిపోయారు. ఇంకా చాలా మంది.. నిద్రపోయే ముందు చాలా సేపు స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. అయితే నిద్రపోయేముందు స్మార్ట్ ఫోన్ వాడితే చాలా అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి సమస్యలు..నిద్రపోవడానికి అరగంట ముందు స్మార్ట్ ఫోన్ ను వాడటం ఆపేయాలి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ ను అదేపనిగా వాడితే… వాటి కాంతి వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ పడుకున్నా కూడా కంటినిండా నిద్రపోలేరు. అంతేకాకుండా ఫోన్ లో ఉండే రేడియేషన్స్ , కాంతి , అండ్ మైండ్ డిస్ట్రర్బ్ అవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నారు. అందుకే గంట ముందు పోనీ అరగంట ముందు అయినా ఫోన్ ఆఫ్ చేసుకుని పడుకోవాలి.
క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మాగ్నెటిక్ రేస్ విపరీతంగా రావడం వల్ల… క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చెవి, బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
సంతాన సమస్యలు..చాలా మంది మొబైల్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటారు. దాని వల్ల రేడియేషన్ బాడీలోకి చేరుతుంది. దీనివల్ల పురుషుల్లో ఉండే స్పెర్మ్ కౌంట్ విపరీతంగా పడిపోతున్నాయని నిర్ధారణ అయింది. దీనివల్ల … సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్లు వాడే వారు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY