ఎన్నికల సంఘం, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లే. ఈనేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా ముగిసినట్లేనని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్నిరోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఎందుకంటే.. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు కొనసాగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ జూన్ 6 వరకూ కొనసాగనునంది.
లోక్‌సభ ఎన్నికలతోపాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశాలో నాలుగు దశల్లో, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లో ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలతోనే వీటిని కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాల్లో పోలింగ్ ముగిసినట్టయింది. అలాగే.. ఏపీ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలన్నింటికీ, ఒడిశాలో 28 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ముగిశాయి.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగియడంతో ఎన్నికల కోడ్ ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు. మరికొందరు ప్రజలు మాత్రం.. ఇంకా దేశ వ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది కదా? ఎన్నికలు కోడ్ మనకు వర్తిస్తుందా? లేక ఎన్నికలు జరిగే ప్రాంతానికే వర్తిస్తుందా? ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓటింగ్ ముగిసిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చాలా మంది ఓటింగ్ పూర్తయిన తర్వాత తమ రాష్ట్రంలో లేదా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ముగుస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇందులో నిజం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఒక రాష్ట్రంలో మొదటి దశ ఓటింగ్ పూర్తయినప్పటికీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. అంటే జూన్ 4 సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నమాట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY