రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంవైపే పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారనగానే.. దేశ విదేశాల నుంచి వచ్చి ఓటేసిన ఎంతో మంది ఓటర్లు రేపు అంటే జూన్ 4న రిలీజవబోయే ఫలితాలపైన క్యూరియాసిటీ పెంచుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ఎన్నికలు ఒక లెక్క .. ఈ సారి ఎన్నికలు ఒక లెక్క అన్నట్లుగా సాగిన ఏపీ ఎన్నికల గురించి నేషనల్ మీడియా సైతం ఫోకస్ పెంచిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే.
మరోవైపు ఏపీ పోలీసుల ఫోకస్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైనే పడింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని ఏపీ పోలీసులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. పిఠాపురానికి భారీ ఎత్తున పారా మిలటరీ బలగాలను పంపించారు. ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పిఠాపురాన్ని క్షుణ్ణంగా పహారా కాస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని వైసీపీ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని పవన్ ను ఓడించడానికి..ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తమ శాయశక్తులా ప్రయత్నించింది.
ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఆయన గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. దీంతో ఆ ఓటమి నేర్పిన పాఠాలను పరిగణనలోకి తీసుకుని పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నారు.జూన్ 4న పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అని వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు సైతం వెల్లడించడంతో.. అందరి దృష్టి అంతా పిఠాపురంపైనే పడింది. పవన్ భారీ మెజార్టీతో గెలిస్తారని సర్వేలు చెప్పడంతో.. పవన్ గెలుపును ఏదోలా అడ్డుకోవాలని వైసీపీ నేతలు కుట్రలకు దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ రోజు ఎక్కడా కూడా చిన్నపాటి వివాదం తలెత్తకుండా ఉండటానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రౌడీషీటర్లతో పాటు, వివాదస్పద వ్యక్తులు, ఎన్నికల్లో గొడవలు పడ్డవారిని కట్టడి చేస్తూ వస్తున్నారు. అలాంటి వారిని పిలిపించి ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఎక్కడికి వెళ్లకూడదని,తాము చెప్పిన ఓ రహస్య ప్రాంతంలో ఉండాలన్న నిబంధన కూడా పెట్టారు. మొత్తంగా సినిమాను తలపించేలా జరుగుతున్న పిఠాపురం ఎన్నికల ప్రక్రియ గురించి దేశవ్యాప్తంగా క్యూరియాసిటీ పెరిగిపోతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE