ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీవీ విజయబాబు నియామకం

AP Govt Appointed PV Vijaya Babu as Chairman of State Official Language Commission,State Official Language Commission,PV Vijaya Babu State Official Language Commission Chairman, AP Govt Appointed PV Vijaya Babu , Mango News,Mango News Telugu,AP Govt Latest News And Updates,Language Commission News And Live Updates,AP Official Language Commission, AP Official Language Commission Chairman, Vijaya Babu's Appointment, Vijay Babu News And Updates, AP Govt Appointed PV Vijaya Babu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీవీ విజయబాబును ప్రభుత్వం నియమించింది. ఈ పదవీలో రెండేళ్ల పాటుగా పీవీ విజయబాబు కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం, అధికార భాష అయిన తెలుగును పరిపాలనలో ఇతోధికంగా ఉపయోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి, పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతిని సమీక్షించి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి తగు సూచనలు, సిఫార్సులు చేయనున్నారు.

2019, ఆగస్టు నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలాన్ని 2021, ఆగస్టు 26న రెండు సంవత్సరాలు పాటు అనగా 2023, ఆగస్టు 25 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇటీవలే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవీకి రాజీనామా చేయటంతో 2022, అక్టోబర్ 20న ప్రభుత్వం రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నూతన అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =