ఢిల్లీ టూ అమరావతి మధ్య ఫ్లైట్

దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్లే వారు డైరక్ట్ ఫ్లైట్ లేక ఇన్ని రోజులు ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు వారికి ఇండిగో శుభవార్త చెప్పింది. ఢిల్లీకి వెళ్లడానికి ఇండిగో కంపెనీ ఇకపై ప్రతిరోజూ విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా ప్రకటించింది.

ఢిల్లీ టూ అమరావతి మధ్య ఫ్లైట్ గురించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఏపీ వాసులతో పంచుకోవడానికి తాను ఎంతగానో సంతోషిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే, ఇది సాధ్యం చేసిన వారందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కాగా, విజయవాడ సమీపంలో గల గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి డిల్లీకి ప్రతి రోజూ కూడా ఇండిగో విమానం రాకపోకలు కొనసాగించనుంది. విజయవాడ టూ ఢిల్లీ మధ్య రాకపోకల సాగించే ఈ ఫ్లై సర్వీసులు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విమానాల అనుసంధానంతో..ఇకపై ఢిల్లీ టూ అమరావతి మధ్య దూరాన్ని మరింత దగ్గర చేయనుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ విమాన రాకపోకల సమయాన్ని వెల్లడించింది. విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరు సమయం ఉదయం 11.10 గంటలు కాగా.. ఢిల్లీకి మధ్యాహ్నం: 1.40 గంటలకు చేరుకుంటుందని వివరించింది. ఇక, ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరే ఫ్టైట్ సమయం రాత్రి 08.10 గంటలకు, విజయవాడకు చేరుకునే సమయం రాత్రి 10.40 గంటలుగా ఇండిగో కంపెనీ తెలిపింది.