ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి – కావలి సభలో సీఎం జగన్

CM Jagan Distributes Pattadar Passbooks of Dotted Lands To 23000 Farmers Today at Kavali Nellore,CM Jagan Distributes Pattadar Passbooks,Pattadar Passbooks of Dotted Lands,Pattadar Passbooks of Dotted Lands To 23000 Farmers,Mango News,Mango News Telugu,CM Jagan Distributes Pattadar Passbooks at Kavali Nellore,Pattadar Passbooks Distribution To Farmers,Pattadar Passbooks,Passbooks To 23000 Farmers,Kavali Nellare Latest News And Updates,CM Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొరపాటున టీడీపీ గెలిచి చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములపై నిషేధం ఎత్తివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషేధిత చుక్కల భూ రికార్డుల నుండి మినహాయించబడిన 43,270 ఎకరాల భూములకు సంబంధించిన పట్టాదార్ పాసు పుస్తకాలను 23,000 మంది రైతులకు సీఎం జగన్ పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రతిపక్ష నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇరువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ ఇప్పుడు సడెన్‌గా రైతు బాంధవులయ్యారని ఎద్దేవా చేసిన సీఎం జగన్.. సూటుబూటు వేసుకుని రైతు సంక్షేమపథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ ప్రసంగంలోని కీలక అంశాలు..

  • గతంలో చుక్కల భూములకు రిజిస్ట్రేషన్ జరగకుండా 22ఏ జాబితాలో చేర్చి నిషేధం విధించడం ద్వారా టీడీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది.
  • ప్రకాశం, కడప, చిత్తూరు, అన్నమయ్యతో పాటు అన్ని జిల్లాల్లో 2.06లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారు.
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక దానిని సరిదిద్ధేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం.
  • చుక్కల భూముల యజమానులకు ఊరట కలిగిస్తూ ఆంక్షలు తొలగిస్తున్నాం.
  • అలాంటి భూములను గుర్తించి 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రెవిన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తున్నాం.
  • దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతుల కుటుంబాలకు మేలు జరిగింది.
  • మొత్తం 2,06,171 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశాం.
  • తద్వారా రైతులకు రూ.20 వేల కోట్ల మార్కెట్‌ విలువైన భూములకు నేటినుంచి సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం.
  • దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం.. ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం.
  • ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం.
  • రాష్ట్రంలో 2.80లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంచాం.
  • లక్షా 20వేల మంది గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేశాం.
  • రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, పంట నష్టపోయినా, ధాన్యం తడిచినా, రంగు మారినా ఆదుకుంటాం.
  • దళారులు లేకుండా ఆర్బీకేల ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసి 21రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నాం.
  • దేశంలోనే తొలిసారిగా రూ.2.10లక్షల కోట్ల రుపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 16 =