ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. వైసీపీ పార్టీ నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. తొలిరోజు సభలో గరవ్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించగా.. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం కూడా సాగుతుండగానే ఆ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అంతకముందు ఏపీ అసెంబ్లీ దగ్గర వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో ప్లకార్డులతో నిరసన తెలుపుతూ వచ్చారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్లకార్డులతో నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోగా.. ప్లకార్డులు చించివేశారంటూ పోలీసు అధికారిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించాలన్నారు. ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలంటూ సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మీ బాధ్యత.. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమన్నారు. ప్లక్కార్డులు చింపమని ఎవరు చెప్పారు అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు ఎప్పుడు పరిస్థితిలు ఇలా ఉండవంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE