అంబటి రాంబాబు.. అందరూ ఆయన్ను సంబరాల రాంబాబు అంటుంటారు. ఆయనకు ముక్కు మీదే కోపం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిడుతూ ఆయనకు ఆయనే ప్రజల్లో వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. ప్రజలే కాకుండా ఆయన సొంత అల్లుడు కూడా అంబటని దూరం పెట్టాడు. ఎన్నికల వేళ తన మామ రాంబాబు దుర్మార్గుడని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన్ను ఓడించాలని సత్తెనపల్లి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన రాంబాబు.. అల్లుడు పెట్టిన సెగలో.. ప్రజా వ్యతిరేకతతో దారుణంగా ఓడిపోయారు.
అయితే ఎన్నికల్లో గెలుపోటములు అనేది సహజం. ఓడిపోయినప్పటికీ నాయకులు ప్రజా తీర్పును గౌరవిస్తారు. ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటారు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం ఓటర్లపై తన అక్కసును వెల్లగక్కారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. డబ్బులు తీసకొని ప్రజలు ఓటేయలేదని వ్యాఖ్యానించారు. సత్తెనపల్లి ఓటర్ల కంటే సుకన్య నే బెటర్ అంటూ రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రస్తుతం రాజకీయాల్లో కక్షపూరిత కాలం నడుస్తోందని మండిపడ్డారు. గతంలో టీడపీ కార్యాలయాలను కూడా తాము కూల్చేసి ఉండాల్సిందని అన్నారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి పనులు చేయొద్దని తమను నిలువరించారని.. మంచి మనసు చాటుకున్నారని పేర్కొన్నారు. ఏడాదిలోపే వైసీపీ విలువ.. జగన్ విలువ ప్రజలకు తెలిసొస్తుందని.. అప్పుడు వారే తమవైపు వస్తారని అంబటి రాంబాబు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ