పల్లెటూళ్లలోనూ పెరుగుతోన్న కాలుష్యం.. పర్యావరణ వేత్తల ఆందోళన

Environmentalists are Concerned About Increasing Pollution in Villages,Environmentalists are Concerned,Concerned About Increasing Pollution,Increasing Pollution in Villages,Pollution in Villages,Mango News,Mango News Telugu,Environmental and Health Impacts,Environmental Issues,Pollution in Villages Latest News,Pollution in Villages Latest Updates,Environmentalists Latest News,Environmentalists Latest Updates,Pollution prevention measures,Codify pollution classifications,pollution evolution, pollution, pollution level,Increasing Pollution Latest News,Increasing Pollution Latest Updates,Increasing environmental pollution News

ఒకప్పుడు పట్ణణాల్లో మాత్రమే వినిపించే కాలుష్యం మాట ఇప్పుడు పల్లెటూళ్లలోనూ కాలుష్యకోరలు (polluters) చాస్తోంది. పల్లెలు కూడా పట్టణ అభివృద్ధిని చూసి ఆ పద్ధతులు ఫాలో అవడం వల్ల పల్లెటూరిలో పొల్యూషన్ పెరిగిపోతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలేజెస్‌లో కూడా సొంత వాహనాలు పెరిగిపోవడం, ఫ్రిడ్జ్, ఏసీ, మైక్రో ఓవెన్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల వాడకం పెరగడంతో అక్కడ కూడా కాలుష్యం పెరిగిపోతుందని తెలుస్తోంది. దీనికి తోడు పట్టణాలలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకునే అధికారులు.. పల్లెలను పెద్దగా పట్టించుకోవడం వల్ల కాలుష్య బారిన పడుతోన్న పల్లెల సంఖ్య పెరుగుతూ వస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాలుష్యపు కన్సల్టేషన్ బేస్డ్ (Consultation based on) రిలవెంట్ రీసెర్చ్ (relevant research)తో పాటు,పెరుగుతోన్న కాలుష్య నివారణ చర్యల సంస్థ.. క్లెమెట్ ట్రెండ్స్ ఈ మధ్య సంబంధిత కాలుష్య పరిణామం (pollution evolution)పై అధ్యయనం చేసి.. ఒక నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించి శాటిలైట్ ప్రాతిపదికన కొన్ని స్థాయిలో వాయు ప్రమాణాల పర్యవేక్షణ (Air quality monitoring) చేపట్టారు. దీనికి ఐఐటీ ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి గణాంకాలను లెక్కలోకి తీసుకున్నారు.

సాధారణంగా గాలి రేణువులలో పేరుకు పోయే కణాల లెక్కలో.. నిక్షిప్తం అయ్యే కాలుష్యాన్ని పీఎంల పరిణామాల్లో గణిస్తారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉండే నివాసం ఉండే నగర, గ్రామీణ ప్రాంతాలలోని కాలుష్య వర్గీకరణలను క్రోడీకరించుకుని (Codify pollution classifications) ఈ సమగ్ర నివేదికను రూపొందించారు. దీని మేరకు ఉత్తరప్రదేశ్‌లో కాలుష్య నివారణ చర్యలు (Pollution prevention measures) 2017 సంవత్సరం నుంచి సత్ఫలితాలను ఇస్తూ వచ్చాయి. అక్కడ అర్బన్‌లో పీఎం 2.5 స్థాయిలో.. 37.18 శాతం కాలుష్యం తగ్గింది. ఇదే గ్రామీణ ప్రాంతాలలో అయితే 38.1 శాతం తగ్గుదల కన్పించింది. మహారాష్ట్రలో అత్యంత దారుణంగా కాలుష్యస్థాయి (pollution level) కేవలం 7.7 శాతం తగ్గింది. గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతం మేర కాలుష్యం తగ్గిందని వెల్లడైంది.

అలాగే శాటిలైట్ల నుంచి సేకరించిన లెక్కల ప్రకారం.. పట్టణాలలో 2017 నుంచి 2022 వరకూ పీఎం 2.5 స్థాయిలో కాలుష్య రేటును లెక్కకట్టారు. దీంతో.. చెన్నైలో 2022లో కాలుష్య స్థాయి 28.90 గా ఉంది. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో పొల్యూషన్ లెవల్ ను కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. కేవలం సిటీల్లోనే కాలుష్య స్థాయి నివారణకు చర్యలకు మాత్రమే అధికార యంత్రాంగం పరిమితమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twelve =