వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు గుడివాడ అమర్నాథ్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఆయన మంత్రిగా పని చేసిన సమయంలో అమర్నాథ్ ఒంటెద్దు పోకడలు పోయారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పలు ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆయన స్థానాన్ని మార్చారు. అనకాపల్లి కాకుండా గాజువాక సీటును అమర్నాథ్‌కు కేటాయించారు. 2024 ఎన్నిల్లో గాజువాక నుంచి పోటీ చేసిన అమర్నాథ్ కూటమి అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అమర్నాథ్ ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారట. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉండేవారు. కానీ ఆయన ఎన్నికల ముందు జనసేనలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ సీటు ఖాళీ అయింది. త్వరలోనే లోకల్ బాడీస్ ద్వారా ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆ పోస్టుపై కన్నేసిన గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్సీ పదవిని ఎలాగైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారట. విశాఖ కార్పోరేషన్.. జిల్లా పరిషత్‌లో వైసీపీకి భారీ మెజార్టీ ఉంది. అంతేకాకుండా విశాఖలో ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు ఎక్కువ మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఈక్రమంలో అక్కడి నుంచి పోటీ చేస్తే ఎలాగైనా గెలవచ్చని గుడివాడ అమర్నాథ్ భావిస్తున్నారట. ఈ మేరకు తెరవెనుక మంతనాలు జరుపుతున్నారట.
అయితే వైసీపీలో అమర్నాథ్ వ్యతిరేక వర్గం ఎట్టి పరిస్థితిలోనూ ఆయనకు ఎమ్మెల్సీ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారట. గుడివాడ అమర్నాథ్‌కు ఎమ్మెల్సీ ఇస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని.. ఇప్పటికే ఆయన వల్ల పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని హైకమాండ్‌తో చర్చిస్తున్నారట. గతంలో ఆయన వల్ల సీనియర్ నేతలు పార్టీని వీడిపోయారని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంటున్నారట. అయితే జగన్‌కు అత్యంత సన్నిహితుడు గుడివాడ అమర్నాథ్. ఈక్రమంలో జగన్ గుడివాడ వైపే మొగ్గుచూపుతున్నారట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE