టీడీపీకి ప్రజా సమస్యలకన్నా రాజకీయాలే ముఖ్యం, అందుకే సభను అడ్డుకుంటోంది – మంత్రి ఆర్కే రోజా

Minister RK Roja Slams TDP Legislators Over Interruption in AP Assembly, Minister RK Roja Slams TDP MLA's, Minister RK Roja Slams Interruption of Assembly, Minister RK Roja , RK Roja Over Interruption in AP Assembly, Mango News, Mango News Telugu, AP Assembly Mansoon Session, Mango News, Mango News Telugu, AP Assembly Sessions, Monsoon session of Andhra Pradesh Legislature, AP Assembly Calendar , Monsoon Session of AP Legislature, Andhra Pradesh Legislative Assembly Sep15th, Monsoon Session, AP Assembly Session Latest News And Updates, YSR Congerss Paty, TDP Party, BJP Party, Janasena Party

ఆంధ్రప్రదేశ్ యువజన క్రీడలు, పర్యాటక శాఖమంత్రి ఆర్కే రోజా ల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే. జాబ్ క్యాలెండర్ వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు స్పీకర్ ను పట్టుబట్టారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడదామని చెప్పడంతో అంగీకరించని టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభను పది నిముషాలు వాయిదా వేశారు. ఈ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడారు. ఏపీలో ఉద్యోగాలు సహా మూడు రాజధానుల బిల్లు తదితర అంశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర టీడీపీదని, దాని అధ్యక్షుడు చంద్రబాబుదని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్నారని, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు. ప్రజా సమస్యలపై నిజంగా సభలో చర్చించాలనే ఆలోచన టీడీపీ సభ్యులకు లేదని, వారికి రాజకీయాలే ముఖ్యమని, అందుకే సభను జరుగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇక వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావించారు. ఇక ఈ సమావేశాల్లోనే సీఎం జగన్ మూడు రాజధానుల బిల్ సభలో పెట్టనున్నారని, దీనిపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =