తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి విజయం అందుకున్నారు. 60వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అప్పటి కుప్పంల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు 13 వేల మెజార్టీలో ఉన్నారు. ఆయనకు మించిన మెజార్టీలో గోరంట్ల రికార్డు దిశగా ముందంజలో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పుట్టుక నుంచి అందులోనే ఉన్నారు. టీడీపీ పునాదుల నుంచి ఉన్న సీనియర్ నేతలలో ఆయన ఒకరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మెచ్చిన నేత. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్ లో కొన్నాళ్ళు మంత్రిగా కూడా పనిచేశారు. తొలిసారి ఆయన 1983లో టీడీపీ తరఫున రాజమండ్రిలో గెలిచారు. అలాగే 1985లో రెండోసారి జయభేరీ మోగించారు. 1989లో తొలిసారి ఓటమి పాలు అయినా 1994, 1999లలో రెండు సార్లు గెలిచి సత్తా చాటారు. ఇక 2004, 2009లలో ఓడారు. అయితే 2014, 2019లలో రాజమండ్రి రూరల్ నుంచి గెలిచి సత్తా చాటారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
రెండు సార్లు వరుసగా రెండు విజయాలు అందుకున్న బుచ్చయ్యచౌదరికి హ్యాట్రిక్ కొట్టాలనే కల నెరవేరింది. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన బుచ్చయ్యకు హ్యాట్రిక్ విక్టరీ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయన వరసగా రెండు సార్లు గెలిచినా మూడోసారి ఓటమి పాలు కావడం వల్ల ఆయన పొలిటికల్ హిస్టరీలో హ్యాట్రిక్ సక్సెస్ అన్న పదం లేకుండా పోయిందట. ఈసారి చాలా పట్టుదల మీద ఆయన పోటీకి దిగారు. రాజమండ్రి రూరల్ టికెట్ ని సాధించుకున్నారు. ఆయన తన పొలిటికల్ కెరీర్ లో పదవసారి పోటీ చేశారు. ఈసారి గెలుపుతో హ్యాట్రిక్ విక్టరీని సాధించడమే కాదు, తన పొలిటికల్ కెరీన్ ని పూర్తి సంతృప్తిగా కొనసాగించాను అన్న హ్యాపీని ఈసారి ఫలితాలు ఇవ్వబోతున్నాయని బుచ్చయ్య ముందు నుంచీ ధీమాగానే ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. బీసీ కార్డుతో వ్యూహాత్మకంగానే పావులు కదిపింది. అయితే నాన్ లోకల్ అన్న టీడీపీ ప్రచారం తో పాటు కేవలం రెండు నెలలకు ముందే ఎన్నికల గోదాలోకి దిగడం మంత్రికి భారీ మైనస్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY