నేడే విశాఖలో భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక మూడో టీ20 మ్యాచ్

India vs South Africa 3rd T20I Match Today at Dr YSR ACA-VDCA Cricket Stadium in Vizag, India vs South Africa 3rd T20I Match Today, Dr YSR ACA-VDCA Cricket Stadium in Vizag, India vs South Africa 3rd T20I, Ind vs SA 3rd T20I, Vizag YSR ACA-VDCA Cricket Stadium, YSR ACA-VDCA Cricket Stadium, India vs South Africa, 3rd T20I, IND vs SA 3rd T20I Pitch Report, IND vs SA 3rd T20I Weather Forecast, YS Rajasekhara Reddy Cricket Stadium in Vizag, YS Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium in Vizag, Ind vs SA 3rd T20I News, Ind vs SA 3rd T20I Latest News, Ind vs SA 3rd T20I Latest Updates, Ind vs SA 3rd T20I Live Updates, Mango News, Mango News Telugu,

భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి విశాఖపట్నంలోని డా.వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లోసౌత్ ఆఫ్రికా జట్టు రెండు మ్యాచుల్లో ఘనవిజయం సాధించడంతో భారత్ జట్టుపై ఒత్తిడి నెలకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో జరిగే కీలక మూడో టీ20 మ్యాచ్ లో విజయం సాధించేలా మెరుగైన ప్రదర్శన చేసేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. ఈ టీ20 సిరీస్‌ కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటుగా సీనియర్ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చారు. అలాగే గాయాలతో బాధపడుతున్న రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్ లను ఎంపిక చేయలేదు. సిరీస్ ప్రారంభంలోనే గాయం కారణంగా కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు.

అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ నాయకత్వంలో యువ ఆటగాళ్లతో మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ కూడా భారత్ జట్టు ఈ సిరీస్ లో ప్రతికూల పరిస్థితులు ఎదురుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్ కోల్పోనుంది. కాగా విశాఖలో పిచ్‌ బ్యాటింగ్‌ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడం, మంచి రికార్డు ఉండడంతో భారత్ జట్టు విజయంపై అభిమానులకు అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టులో బ్యాటింగ్ లో డేవిడ్ మిల్లర్‌, వాండర్‌ డసెన్‌, హెండ్రిక్స్, క్లాసెన్‌, ప్రిటోరియస్‌ రాణిస్తుండగా, బౌలింగ్ లో కగిసో రబాడ, వేన్ పార్నెల్‌, షమ్సీ, కేశవ్‌ మహారాజ్‌ రాణిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తూ ఊపుమీదున్న సౌత్ ఆఫ్రికా జట్టుపై విజయం సాధించాలంటే భారత్‌ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది.

భారత్ తుది జట్టు అంచనా : రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా/శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్.

సౌత్ ఆఫ్రికా తుది జట్టు అంచనా: టెంబా బావుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాండర్‌ డసెన్‌, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =