
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం.. భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ వస్తోంది. వీరిలో చాలామంది జిల్లా కలెక్టర్లు, జేసీలు, కార్యదర్శులు, ఎస్పీలు ఉండగా.. వీరిలో ఓ ఇద్దరి అధికారుల ఎంపిక మాత్రం ఏపీలో ప్రాధాన్యం సంతరించుకుంది. సర్కారు బదిలీ చేసిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీ ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. భార్యాభర్తలయిన జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీని ఏలూరు జిల్లాకు పంపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 20 వ తేదీన చేసిన బదిలీల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి.ధాత్రి రెడ్డిని నియమించగా.. అలాగే జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను నియమించింది. మొన్నటివరకూ పాడేరు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ధాత్రి రెడ్డి..తాజా ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. కాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి గ్రామానికి చెందిన పి. ధాత్రి రెడ్డి..2019లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్ ట్రైనింగ్ సమయంలో మళ్లీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అంతకు ముందు డచ్ బ్యాంక్‌లో పని చేసిన ధాత్రి.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
మరోవైపు ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ కిషోర్ కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌లోనే చదువుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ యువ ఐపీఎస్.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా పని చేశారు.ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే ప్రధాని సిల్వర్ కప్ అందుకున్నారు. సమర్ధుడైన యువ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రతాప్ శివ కిషోర్ ఇప్పుడు.. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో.. ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. ఇలా భార్యాభర్తలు ఒకే జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా భార్యాభర్తలు సేవలు అందించనుండటం విశేషం సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ