ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. అయిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. ఎవరూ ఊహించని విధంగా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మంత్రులు, కీలక, నేతలు కూడా ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో వైసీపీ ఓటమికి సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. అయితే అందులో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లిక్కర్ పాలసీ వల్లే వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పలువురు నేతలు కూడా బయటకు వచ్చి ఈ రెండు కారణాల వల్లే వైసీపీ ఓడిపోయిందని వెల్లడించారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ రెండు కారణాలే వైసీపీ ఓటమిలో కీలకంగా మారాయని తేల్చేశారు.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న వెంకట రెడ్డి పేరు మారుమ్రోగిపోతోంది. వైసీపీ ఓటమికి గల ప్రధాన కారణాల్లో ఆయన కూడా ఒకరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో రాష్ట్రంలో ఉన్న వెంకట రెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. ఆయన్ను గనుల శాఖ డైరెక్టర్‌గా నియమించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, గనుల వ్యవహారాలన్నింటిని ఆయనే చూసుకున్నారు. అయితే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు ముద్రించడం.. సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించడం వంటి సలహాలను అప్పట్లో వెంకట్ రెడ్డిను జగన్‌కు ఇచ్చారట. ఆయన సలహా మేరకే వైసీపీ ప్రభుత్వం పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలను ముద్రించిందట.
అయితే ఎన్నికల వేళ ఇదే అంశాన్ని టీడీపీ కూటమి దివ్యాస్త్రంగా వాడుకుంది. పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు ముద్రించడం ఏంటని ప్రశ్నించింది. ఇదే అంశాన్ని జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లింది. ఫలితంగా వైసీపీకి ఎంత డ్యామేజీ జరగాలో అంతా జరిగింది. ఈక్రమంలో వైసీపీకి వెంకట రెడ్డి ఇచ్చిన సలహాల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పలువురు నేతలు బహిరంగంగానే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా పాస్ పుస్తకాలపై ఫొటోలను ముద్రించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE