ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. గతంలో వైసీపీ ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన నేతలకు గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. గతంలో కొందరు వైసీపీ నేతలు అప్పటి ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకొని టీడీపీపై రెచ్చిపోయారు. టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. అన్యాయంగా వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అంతేకాకుండా టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు చేశారు. ఈక్రమంలో అప్పట్లో రెచ్చిపోయిన నాయకులపై కేసులను కూటమి ప్రభుత్వం తవ్వుతోంది. వారికి తగిన బుద్ధి చెప్పేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ కీలక నేతల్లో ఒకరైన వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించేవారు వల్లభనేని వంశీ. చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. అయితే త్వరలోనే ఆయన అరెస్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వల్లభనేని వంశీనే ఈ దాడి చేయించారని.. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని కోర్టుకు పోలీసుల తరుపున న్యాయాది వెల్లడించారు. ఈ మేరకు మేరకు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద పోలీసులు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన అరెస్ట్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో.. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లేందుకు వంశీ సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE