
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు లైన్ క్లియర్ అయినట్టుగానే తెలుస్తోంది.కొద్ది రోజులుగా దువ్వాడకు ఇంటి పోరు తప్పేలా లేదన్న ప్రచారం జోరుగా సాగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తాను కూడా పోటీకి సిద్ధం కావడంతో వైసీపీ వర్గాలే షాక్ అయ్యాయి. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జెడ్పీటీసీ సభ్యురాలైన దువ్వాడ వాణి.. తన వర్గాల దగ్గర ప్రకటించడం చర్చనీయాంశం అయింది.
అయితే ఆమె ఈ నె 22న అంటే సోమవారమే నామినేషన్ వేస్తానని చెపారు కానీ..అలాంటి వాతావరణం కనిపించకపోయేసరికి అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. చివరకు వాణి నామినేషన్ వేయడంపై వెనక్కి తగ్గారని.. టెక్కలిలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి రెడీ అన్న దువ్వాడ వాణి.. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
తమ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు ఇంటి నుంచే పోటీ ఎదురవడం పార్టీపైనా ప్రభావం చూపిస్తుందన్న లెక్కలతో ఈ ఇంటిపోరుపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. వెంటనే రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపి.. దువ్వాడ వాణిని బుజ్జగించడంతో వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.దీంతో తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయింది.
ఈ పరిణామాలతో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. అయితే తన భార్య వాణి నామినేషన్ వేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన దువ్వాడ శ్రీనివాస్… వాణి తన భార్య అయినా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే అధికారం ఉందని.. కాదని చెప్పే అర్హత తనకీ కూడా లేదని అన్నారు. అయినా లోపల వెంటాడిన భయంతో వెంటనే అధిష్టానం దగ్గరకు పరుగులు తీయగా.. చివరకు భార్యభర్తల పొలిటికల్ పంచాయితీకి ఫుల్ స్టాప్ పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY