ఢిల్లీలో మొదలైన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ఏపీ పెవిలియన్‌ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన

AP Finance Minister Buggana Rajendranath Reddy Inaugurates AP Pavilion at The 41st India International Trade Fair in Delhi,AP Finance Minister Buggana Rajendranath Reddy,AP Finance Minister,Buggana Rajendranath Reddy,Inaugurates AP Pavilion,AP Pavilion,Mango News,Mango News Telugu,41st India International Trade,India International Trade Fair,41st India International Trade Fair,International Trade Fair In Delhi,AP CM YS Jagan Mohan Reddy,YSR Congress Party

మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ – ఐఐటీఎఫ్)-2022 ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం లాంఛనంగా ఈ మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వై విజయసాయి రెడ్డితో కలిసి ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించారు. కాగా ‘వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ టు గ్లోబల్’ అనే థీమ్‌తో ఈ ఫెయిర్ ఏర్పాటు చేయబడింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకత కలిగిన దాదాపు 20 జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రదర్శన కోసం ఉంచింది. డ్వాక్రా, మెప్మా వంటి మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేయబడిన మ్యాంగో జెల్లీలు, క్రిస్టల్ బాగ్స్, లెదర్ ప్రోడక్ట్స్ వంటివి ఉంచారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ కింద పరిశ్రమలు, వాణిజ్య ప్రమోషన్ కార్పొరేషన్, చేనేత మరియు జౌళి శాఖలకు చెందిన వాణిజ్య ఉత్పత్తులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంటూరు మిర్చి, ధర్మవరం పట్టు చీరలు, ఉప్పాడ-వేంకటగిరి-మంగళగిరి చీరలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ, బందరు లడ్డు, తిరుపతి లడ్డు, బొబ్బిలి వీణ వంటి ఏపీకే ప్రత్యేకమైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. ఇక ఈ ట్రేడ్ ఫెయిర్ అనేది ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం దేశ రాజధానిలో నిర్వహించే ఒక ప్రధాన కార్యక్రమం. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సాధారణ సందర్శకులను మరియు వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన హస్త కళలు మరియు చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడానికి పెవిలియన్ ప్రారంభించింది. ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్న ఈ ఫెయిర్ లో ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలు తమ తమ పెవిలియన్స్ ఏర్పాటు చేశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =