కరోనా : ఏపీలో ఆ నగరంలో 8 రోజులపాటు లాక్‌డౌన్

Andhra Pradesh, AP Corona Cases, AP Coronavirus, AP COVID 19, Lockdown Declared in Nellore, Lockdown Declared in Nellore City, Nellore Coronavirus Lockdown, Nellore Coronavirus News, Nellore Lockdown, Nellore News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో  గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో జూలై 22 నాటికీ మొత్తం కేసుల సంఖ్య 3010 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా నెల్లూరు నగరంలో 8 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ కే.వి.ఎన్ చక్రధర బాబు ప్రకటించారు. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జూలై 24 నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్ విధించనున్నారు. లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వస్తువుల దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతించనున్నారు. అలాగే 11 AM నుంచి 7 AM వరకు అత్యవసర వైద్య సేవలకు తప్పించి, ఇతర ఎలాంటి కదలికలకు అనుమతి ఉండదని చెప్పారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రం కరోనా నిబంధనలు అనుసరించి విధులకు హాజరవుతారని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu