ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. అయిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ.. తాజాగా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందింది. అలాగే కేవలం నాలుగు పార్లమెంట్ స్థానాలకే పరిమితమయింది. కంచుకోటల్లో కూడా ఈసారి వైసీపీ ప్రభావం చూపలేకపోయింది. ఈక్రమంలో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈక్రమంలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన విశ్వేశ్వర రాజు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన త్వరలోనే తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వేశ్వర రాజు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో.. విశ్వేశ్వరరాజు ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇప్పటికే ఆయన టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని.. పార్టీలోకి తీసుకునేందుకు అటు సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ ప్రచారానికి చెక్ పెట్టారు విశ్వేశ్వరరాజు. ఆయన వైసీపీని వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని వెల్లడించారు. తన రాజకీయ ఎదుగుదలకు జగన్మోహన్ రెడ్డినే కారణమని చెప్పారు. ఎన్నోసార్లు తనకు జగన్ అండగా నిలిచారని.. అటువంటి వ్యక్తిని మోసం చేస్తే పుట్టగతులుండవని అన్నారు. తాను ఎట్టిపరిస్థితిలోనూ వైసీపీ వీడే ప్రసక్తి లేదని.. అయిదేళ్లు ప్రజల మధ్యే ఉండి వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రాజు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE