ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

MLC By Election Schedule Released,MLC By Election Schedule,MLC Schedule, bjp, Election heat in AP,Janasena, MLC By-election, MLC by election schedule,TDP,YCP, AP election results , Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News,Mango News, Mango News Telugu
Election heat in AP,MLC by-election schedule, MLC by-election, YCP, TDP, Janasena, BJP

మొన్నటి వరకూ లోక్ సభ, శాసన సభ ఎన్నికలు, ఆ ఫలితాలతో హీటెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కబోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్‌ వల్ల ఖాళీ అయిన స్థానాల్లో ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు జూన్ 26 బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు జులై 2వ తేదీ వరకు  తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చు. జులై 3న నామినేషన్ల పరిశీలన  ఉంటుంది.

నామినేషన్ల దాఖలుకు జులై 2వ తేదీ తుది గడువు కాగా.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం జులై 5 వ తేదీ వరకు  ఉంటుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించిన రోజునే  ఫలితాలను వెల్లడిస్తారు. అయితే కూటమికే 2 స్థానాలు దక్కే అవకాశముంది. వైఎస్సార్సీపీ పోటీ చేస్తే మాత్రం జులై 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ