మద్యపాన నిషేధంపై జగన్ మాట

CM Jagan Tweeted About Liquor Ban In Andhra Pradesh,Mango News,CM YS Jagan Tweet on Liquor Ban,Andhra Pradesh government Latest News,Govt moving toward banning liquor tweets CM YS Jagan,YS Jagan Happy For Approval Of Liquor Control Amendment Act

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మద్యపాన నిషేధం పై స్పందించారు. అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మద్యపానం కాపురాల్లో చిచ్చు పెడుతుందని, మానవ సంబంధాలను నాశనమైపోతున్నాయని, ఇక మద్యాన్ని స్టార్ హోటల్స్ కే పరిమితం చేసి, మూడు దశల్లో పూర్తిగా నిషేధిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆ హామీలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.ఇక పై మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించేలా చట్టం తీసుకొచ్చారు.

ఈ విషయంపై వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేసారు,’ మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయని చెప్పారు.

[subscribe]
[youtube_video videoid=ZsEQCA0vbxM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 13 =