
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఆశ్చర్యకర రాజకీయాలు చేస్తున్నారు. కొందరేమో వాటిని ‘‘రాజీ’’కీయాలు అంటున్నారు. కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ కొన్నాళ్లుగా రెడ్లవైపు నిలుస్తున్న క్రమంలో ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన పవన్ వెనుక నడుస్తాడనుకున్న పద్మనాభం.. ఎన్నికల ముందు అకస్మాత్తుగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. పవన్ ఆయన ఇంటికి వెళ్లకపోవడమేనట. అలాగనీ జగన్ వెళ్లాడా అంటే.. అదీ లేదు. మరి వైసీపీలో ఎలా చేరారు.. ఎందుకు చేరారు అన్నది ఆయనకే తెలియాలి.
అదలాఉండగా.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీచేస్తున్నప్పటి నుంచీ ఆయన ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో ముద్రగడ కూడా భాగస్వాములయ్యారు. పవన్-ముద్రగడ ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో ఆయనపైకి పద్మనాభాన్ని ఉసిగొల్పుతోంది వైసీపీ. ఈక్రమలోనే తాజాగా మరోసారి పవన్‌పై ముద్రగడ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో నటించాలి కానీ, రాజకీయాల్లో కాదని, పిఠాపురంలో పవన్‌ను ప్రజలు తన్ని తరిమేయడం ఖాయమని అన్నారు. అంతేకాదు.. పిఠాపురంలో పవన్‌ను వైసీపీ ఓడించకపోతే తన పేరు పద్మనాభం కాదని, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఇప్పుడిది కాపువర్గాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో సవాళ్లు-ప్రతిసవాళ్లు సాధారణమే కానీ.. కాపు ఉద్యమనేతనని, కాపుల సంక్షేమమే తన లక్ష్యమని చాటుకునే ముద్రగడ పద్మనాభం.. పవన్ గెలవకపోతే రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటా.. పేరు మార్చుకుంటా’’ అంటూ సవాళ్లు ఇప్పటి వరకూ విన్నాం కానీ.. కాపు.. రెడ్డిగా పేరు మార్చకుంటానని చెప్పడంతో ముద్రగడపై ట్రోల్స్ నడుస్తున్నాయి. కొంతకాలంగా రెడ్లకు మద్దతుగా నిలుస్తున్న పద్మనాభం.. ఈరకంగా జగన్‌రెడ్డిపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారని కాపునేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపునేతగా, ఉద్యమకారుడిగా గోదావరి జిల్లాల్లో ఇప్పటివరకు ఉన్న గుర్తింపును ఇలాంటి వ్యాఖ్యలద్వారా ముద్రగడ పోగొట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY