ఎన్నికల వేళ టర్న్‌లు, యూ టర్న్‌లు తీసుకుంటున్న రాజకీయాలతో ఏపీ హీటెక్కిపోతోంది. పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. దీంతో ఎక్కడ గెలిచినా గెలవకపోయినా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ ను ఎలా అయినా ఓడించాలన్న కంకణం కట్టుకున్న ఏపీ సీఎం జగన్ పవన్‌ను ఓడించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. కాపులను తన వైపు లాక్కోవడానికి ముద్రగడ పద్మనాభాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. దీనికి తోడు అక్కడ ఎంత ఖర్చయినా పర్వాలేదు పవన్ గెలవకూడదనే ఆదేశాలు జారీ చేయడంతో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఇప్పుడు కంటి మీద కునుకు దూరం అయింది.
పవన్ కళ్యాణ్ మీద కోపంతో వైసీపీలోకి వెళ్లిన ముద్రగడ ..జగన్ మెప్పుకోసం పార్టీలో తన ఉనికి కోసం అప్పుడప్పుడూ జనసేనాని మీద కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అలా తాజాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను కనుక ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మీడియా ముందుకు వచ్చి మరీ చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ పద్మనాభం తీరును, ఆయన విసిరిన చాలెంజ్‌ను ముద్రగడ కుమార్తె క్రాంతి వ్యతిరేకించారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారని క్రాంతి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని తన తండ్రి చాలెంజ్ విసరడం తనకు చాలా బాధనిపించిందని అన్నారు. ముద్రగడ ప్రకటన తన సొంత వర్గీయులకు కూడా నచ్చలేదని క్రాంతి చెప్పుకొచ్చారు.
తన తండ్రే కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. ఎవరైనా సరే వంగా గీత గెలుపు కోసం పనిచేసుకోండి.. కానీ పవన్ కళ్యాణ్‌ను, పవన్ అభిమానులను కించపరిచేలా కామెంట్స్ చేయకూడదని క్రాంతి వివరించారు. కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి సీఎం జగన్ ముద్రగడను వాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల అయ్యాక ముద్రగడను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా అని క్రాంతి జోస్యం చెప్పారు.
అంతేకాదు తాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. దీంతో ముద్రగడ కూతురు క్రాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో వైరల్ గా మారాయి. ఎంత అనుభవం ఉండి ఏం లాభం .. స్వంత లాభం చూసుకుని తండ్రి అలా మాట్లాడుతుంటే..కూతురు మాత్రం ఎంత క్లారిటీగా మాట్లాడుతుందో చూడంటంటూ జనసైనికులు ఈ వీడియాను షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా తండ్రి వైసీపీకి,కూతురుకు జనసేనకు సపోర్టు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY