ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గాజు గ్లాస్ గుర్తు కోసం జరుగుతున్న పొలిటికల్ రగడలో కొత్త ట్విస్ట్ నెలకొంది. విజయనగరం తెలుగు దేశం పార్టీ రెబల్ మీసాల గీతకు ఎన్నికల సంఘం గ్లాస్ సింబల్ కేటాయించడంతో కూటమి అభ్యర్ధులలో ముఖ్యంగా జనసేన పార్టీలో కొత్త టెన్షన్ మొదలయింది.
నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్థుబాట్లు, అసంతృప్తుల బుజ్జగింపులతో తలమునకలైన పార్టీ అధినేతలంతా ఈ మధ్యే ప్రచారంలో జోరు పెంచారు. అయితే మే 13న జరగనున్న పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో.. నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించేసి ప్రచారంలో దూకుడు పెంచారు.
ఇలాంటి సమయంలోనే ఎన్నికల గుర్తు ఇప్పుడు కూటమి నేతలకు తలనొప్పిగా మారింది. తాజాగా జనసేనకు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్ అదే సమయంలో కామన్ సింబల్‌గా గాజు గ్లాసును పేర్కొనడమే సమస్యగా మారింది. ఇప్పటికే జనసేనకు గాజు గుర్తు అనేది ప్రజల్లోకి వెళ్లిపోగా.. దానిని కామన్ సింబల్ గా కేటాయించడంతో జనసేన, టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఈ గుర్తును స్వతంత్య్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ ఈసీని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం..తాము నిబంధనల ప్రకారమే గాజు గుర్తును కేటాయించామని చెప్పారు. దీంతో మొన్నటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ లిస్ట్‌లో ఉండటంతోనే స్వతంత్ర అభ్యర్దులకు కేటాయించినట్లు తెలుస్తోంది.దీనికి తోడు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుండటంతో.. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తోంది.
అందుకే జనసేన పోటీ చేయని 154 స్థానాల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు అందుబాటులో ఉంచారు . అంటే దీని ప్రకారం ఏ పార్టీకి సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా సరే గ్లాస్ గుర్తు కోరితే వాళ్లకు ఆ గుర్తును కేటాయించనున్నారు. ఇలాగే తెలుగుదేశం పార్టీ రెబల్‌గా పోటీ చేస్తున్న మీసాల గీత కోరికతో గ్లాస్ గుర్తును ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అయితే దీంతో జనసేన పోటీ చేయని స్థానాల్లో కూడా ఈ గుర్తు వల్ల ఓట్ల చీలిక ఉండనుందనే భయం టీడీపీ నేతల్లో కన్పిస్తోంది.
మరోవైపు గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తాము పొత్తులో ఉండటం వల్లే.. కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నామని, దీనికోసమే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని వివరించింది.
ఫ్రీ సింబల్ అని చెప్పి తమ పార్టీ పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన సవాల్ చేయగా.. దీనిపై న్యాయస్థానం విచారణకు ఆ సవాల్ ను స్వీకరించింది. ఫ్రీ సింబల్ పేరుతో వేరే అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించగా.. దీనిపై 24 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY