ఈరోజు విజయవాడలో పలు ఆందోళనలు.. నగర పోలీసుల కట్టుదిట్టమైన భద్రత

ఈ రోజు విజయవాడలో జరుగనున్న పలు ఆందోళనలు నగర పోలీసులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో.. గాంధీనగర్ ఎన్జీవో హోం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఎన్జీవో హోంకు వెళ్లే అన్ని మార్గాలకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. పీఆర్సీ అంశంపై నేతలతో విభేదించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఎన్జీవో హోంను ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. నగర పోలీసులు భారీ బలగాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, మరోవైపు ధర్నాచౌక్‌లో రాజధాని అమరావతి కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. ఇంకోవైపు కృష్ణా జిల్లాను రెండుగా విభజించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో టీడీపీ నేతలు కొన్ని డిమాండ్లను వినిపించారు. తూర్పు కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు.. పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ నిరసన దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా వేలాదిమందితో నిరసన తెలుపుతానని బోండా ఉమ నిన్న స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు దానిపై కూడా కన్నేశారు. ఈ ఆందోళనల నడుమ ఎలాంటి విపత్కర పరిస్థితులకు తావివ్వకుండా నగరంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eleven =