ఏపీలోని జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీఎస్పీతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు తమ తమ ఓట్లు వేశారు. అయితే ఏ పార్టీ అభ్యర్ధి మీద సరైన అభిప్రాయం లేనివాళ్లు , తమ ఓటు హక్కు వ్యర్దంగా పోకూడదు అలాగే ఆయా నేతలపై ఉన్న తమ వ్యతిరేకతను తెలియజేయడానికి నోటా ఓట్లు వేస్తుంటారు. ఇది మామూలు విషయమే. కానీ ఈ ఎన్నికలలో కూడా గత ఎన్నికలలో లాగే.. వేలాది మంది నోటాకు ఓటు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అందులోనూ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ వేలాది నోటా ఓట్లు వేసిన సంఖ్య ఎక్కువగా ఉండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
2019 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు జరిగిన ఎన్నికలలో.. కొన్ని నియోజక వర్గాల్లో నోటాకు తక్కువ ఓట్లు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభావం ఎక్కువగా ఉందని దీంతో అక్కడ హోరాహోరీగా ఎన్నికలు సాగుతాయని అంతా భావించారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా సాగిపోయాయి. చిత్తూరు జిల్లాలో పుంగనూరు స్థానం తప్ప మిగిలిని అన్ని స్థానాల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒక్కరే చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా నిలిచారు.
చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో కూడా వేల సంఖ్యలో నోటా ఓట్లు పోలవడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పోటీ చేసిన నగరి నియోజక వర్గంలో 66 నోటా ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో నగరిలో 1,688 నోటా ఓట్లు పోలవగా.. ఇప్పుడు 1,744 నోటా ఓట్లు పోలయ్యాయి.
అలాగే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో 2వేల115 నోటా ఓట్లు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బరిలో దిగిన పుంగనూరులో 2,904 నోటా ఓట్లు, ఆర్కే రోజా పోటీ చేసిన నగరిలో 1,744 నోటా ఓట్లు, మాజీ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి పోటీ చేసిన పలమనేరు నియోజకవర్గంలో 2,344 నోటా ఓట్లు, చిత్తూరు నియోజకవర్గంలో1,096 నోటా ఓట్లు, జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 2,125 నోటా ఓట్లు, పూతలపట్టు నియోజకవర్గంలో 1,430 నోటా ఓట్లు పోలయ్యాయి.
చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 16,713 నోటా ఓట్లు పోలయితే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13,748 నోటా ఓట్లు పోలయ్యాయి. అయితే చిత్తూరు జిల్లాలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటా ఓట్లు ఎక్కువగా పడ్డాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ