జనవరి 31 వ తేదికల్లా.. 22వేల 500 గోకులాలు, ఫిబ్రవరి 28 నాటికి 3వేల 758 కిలో మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇటీవల చరిత్రలో ఇప్పటి వరకు గెలిచిన తర్వాత ఎవ్వరూ కూడా వెళ్లని గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అలా మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతాల్లో వాళ్ల కోసం తిరిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీసీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ని చూసి..అభినందించిన వారికంటే కూడా ఎద్దేవా చేసినవాళ్లే ఎక్కువ. పవన్‌కు ఏం అనుభవం ఉందని ఉపముఖ్యమంత్రి పదవి అన్నవాళ్లే ఎక్కువమంది . అయితే కూటమి 7 నెలల పాలనలో తన మార్కు చూపిస్తూ వస్తున్నారు. చివరకు డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈ పనులు కూడా చేసి ప్రజలకు మేలు చేయొచ్చా అని పాత ఉపముఖ్యమంత్రులు కూడా ఆలోచనలో పడేలా పని చేస్తున్నారు.
ఒకేసారి 13 వేల గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి, ఆ గ్రామాల్లో ఉండే సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియని ప్రారంభించారు. ఃతర్వాత ‘పల్లె పండుగ’ పేరుతో 2500 కోట్లతో నిధులను విడుదల చేసి రాజకీయాలలో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాదు అనుకున్న ప్రణాళిక ప్రకారంగా కేవలం 6 నెలల్లోనే 2450 సీసీ రోడ్లు, 20 వేలకు పైగా గోకులాలు, గ్రామాల్లో ఎన్నో మౌలిక సదుపాయాలు సమకూర్చి అందరి మన్ననలు అందుకున్నారు. అదే జోష్ తో జనవరి 31కి 22వేల500 గోకులాలు, ఫిబ్రవరి 28 నాటికి 3వేల758 కిలో మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల పవన్ గిరిజన గ్రామాల్లో పర్యటించినప్పుడు గిరిజనులు తమకు కనీసం మట్టి రోడ్లను అయినా నిర్మించండి అయ్యా అని మొరపెట్టుకున్నారు. అయితే మట్టి రోడ్లు కాదు, సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ వాళ్లకు మాట ఇచ్చిన పవన్… ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు గిరిజన గ్రామాల్లో రోడ్డు నిర్మాణం కోసం 275 కోట్ల రూపాయిలను విడుదల చేస్తూ జీవో ని జారీ చేశారు. ఈ 275 కోట్ల రూపాయల నిధులలో కేంద్రం వాటా 163.39 కోట్ల రూపాయలు కాగా, ఏపీ వాటా 111.68 కోట్లుగా ఉంటుంది.దీంతో సరైన పద్దతిలో ఖర్చు చేస్తే కేంద్రం నుంచి నిధులు ఏ స్థాయిలో వస్తాయి అనడానికి కూటమి ప్రభుత్వం పాలనే నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది.