హైదరాబాద్ లోని క్యాబ్ డ్రైవర్ల సమస్యపై మాట్లాడిన పవన్..

Pawan Spoke About The Problem Of Cab Drivers In Hyderabad, Cab Drivers In Hyderabad, Cab Drivers Problems In Hyderabad, Hyderabad Cab Drivers Problems, Pawan Comments On Hyderabad Cab Drivers Problems, AP News, Cab Driver’S Issue, Hyderabad Cab Drivers, Pavan Kalyan, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

తెలంగాణలో ఉన్న ఏపీ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవద్దని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్భార్ లో పాల్గొన్న పవన్ కు ఆర్జీలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున్న ప్రజలు అక్కడికి వెళ్లారు . ఇక హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం కూడా గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతాయి. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి, వారికి సహకరించాలన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ లను అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ అక్కడ వారు బతకలేకపోతున్నామని క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను చెప్పేందుకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని, తెలుగు ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని పవన్ అన్నారు.

తాను పదేపదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలని చెప్పడానికి కారణం వెల్లడించారు. ఏపీలో అవకాశాలు మెరుగైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని, ఫలితంగా తెలంగాణ ప్రజలకు పలు రంగాల్లో ఉపాధి మెరుగవుతుందన్నారు. ఏపీ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పిన పవన్ మళ్లీ ఇక్కడ ఆఫీసులు మొదలు అవుతాయని ఇక్కడ కూడా అవకాశాలు పెరుగుతాయన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదన్నారు. మానవత థృక్పధంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చూస్తాం. హైదరాబాద్ లోని క్యాబ్ డ్రైవర్ కార్మికులు సైతం ఏపీకి చెందిన తోటి డ్రైవర్ల కోసం స్పందించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకారం అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.