అందుకే ముద్రగడ వైసీపీలో చేరడం లేదా..?

That is why Mudragada is not joining YCP,why Mudragada is not joining,Mudragada not joining YCP,AP Politics, mudragada padmanabham, CM Jagan, Janasena,Mango News,Mango News Telugu, Mudragada,Mudragada Into TDP,Mudragada Padmanabham Leaving YSRC,Jagan Not Give Seat Mudragada,Mudragada Padmanabham Latest News,Mudragada Padmanabham Live Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
AP Politics, mudragada padmanabham, CM Jagan, Janasena

ఏపీలో రాజకీయ సమీకరణాలు క్షణాల్లో మారిపోతున్నాయి. ఎన్నికల ముంగిట నేతలు రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. వైసీపీలో చేరబోతున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. జగన్‌తో కూడా చర్చలు జరిపారని.. వైసీపీలో ముద్రగడం చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. అనూహ్యంగా ఇప్పుడు ముద్రగడ జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ముద్రగడకు ఎక్కడ చెడిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఒక అసెంబ్లీ టికెట్, ఒక ఎంపీ టికెట్ ఇస్తానని ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ముందు ఆఫర్ ఇచ్చారట. కానీ ముద్రగడ కాకినాడ ఎంపీ టికెట్.. పిఠాపురం, ప్రత్తిపాడుతో పాటు మరికొన్ని స్థానాలను తన సన్నిహితుల కోసం కోరారట. కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం కాకినాడ ఎంపీ టికెట్ ముద్రగడ పద్మనాభంకు.. పెద్దాపురం టికెట్ తన తనయుడు గిరిబాబుకు ఇస్తామని తేల్చేసిందట. కానీ అందుకే ముద్రగడ అంగీకరించనట్లు తెలుస్తోంది. అలాగే ముద్రగడ ఎటూ తేల్చలేకుండా ఆలస్యం చేశారట.

దీంతో ఆయా స్థానాలకు కూడా జగన్ ఇంఛార్జ్‌లను ప్రకటించేశారు. పిఠాపురం, ప్రత్తిపాడు  రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇలా వైసీపీతో ముద్రగడ పద్మనాభంకు చెడినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీతో ముద్రగడకు చెడిందని తెలిసిన వెంటనే.. జనసేన నేతలు ముద్రగడకు టచ్‌లోకి వెళ్లారు. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. కాపులకు న్యాయం జరగాలంటే జనసేనలోనే చేరాలని సూచించారు.

అయితే పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే.. ఆలోచిస్తానని ముద్రడ జనసేన నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తాను కోరినన్ని సీట్లు ఇవ్వాలని ముద్రగడ కండీషన్ పెట్టారట. అయితే ముద్రగడ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఆయన్ను కలిసేందుకు సిద్ధమయ్యారట. సంక్రాంతి పండుగ సమయంలో ఆయన్ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ముద్రగడ అడిగినన్ని స్థానాలు కూడా ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 1 =