ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెబుతోంది. తన రాజకీయ అవసరం కోసమో, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం కారణమో తెలియదు కానీ ఏదో విధంగా చంద్రబాబు ప్రభుత్వానికి వరుస గుడ్ న్యూస్‌లు అందిస్తోంది.
సీఎం చంద్రబాబు అడిగిందే ఆలస్యం అన్నట్లు ఏపీకి సాయం చేయడంలో ముందు ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో అంశంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న పనిదినాల్ని పెంచాలని, వీటి పరిధి కూడా విస్తరించాలని మోదీ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో ఏపీ ప్రభుత్వం కోరుతోంది. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం ఏపీలో ఈ ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన పని దినాల్ని పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.
2024-24 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్లో ఉపాధి హామీ పని దినాలు పెంచడానికి కేంద్రం అంగీకరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం..ఏపీలో ఉపాధి హామీ పనిదినాల్ని 15 కోట్ల రూపాయల నుంచి 21.5 కోట్ల రూపాయలకు పంచుతూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పని దినాలు పెంపునకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందుకు ప్రధాన మంత్రి మోదీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పెంపు మూలంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.