ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన

Rain Forecast For These Parts Of AP

దక్షిణ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ నమోదయ్యే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కనిపించే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశము ఉంది.

అలాగే గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కనిపించే అవకాశముంది.

రాయలసీమలో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కనిపించే అవకాశముంది.