వదలనంటున్న వరుణుడు.. నాలుగు రోజుల పాటు వర్షాలు

Rains For Four Days, Four Days Rains, Rains Upcoming Four Days Rains, Meteorological Department, Officials Of Meteorological Department, Rains, Rains For Four Days, Heavy Rain In AP, Weather Report, Red Alert, Heavy Rains In Telangana, Weather Report, Red Alert In Hyderabad, TS Live Updates, Heavy Rain, Andhra Pradesh, AP Rains, AP Live Updates, Political News, Mango News, Mango News Telugu

తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుణుడు ఇప్పట్లో వదిలేటట్లు లేడు. తెలంగాణలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గురువారం జయశంకర్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించిన అధికారులు ఆరెంజ్ అలెర్ట్ చేశారు.

తెలంగాణపై రుతుపవనాలు ఉదృతంగా వీస్తున్నాయి. ఉత్తర తెలంగాణ వద్ద బంగాళాఖాతం తీర ప్రాంతంపై 3.1 నుంచి 7.6 కి.మీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతోనే ఇప్పుడు గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఈ శాఖ అధికారులు ప్రకటించారు.

మరోవైపు రుతుపవన గాలుల ద్రోణి 15వందల మీ. ఎత్తున రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి మధ్యప్రదేశ్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతోనే తెలంగాణలో భారీ వర్షాల నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.నాలుగు రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే.. మళ్లీ నాలుగు రోజుల పాటు భారీగా వర్షం కురిసే సూచనలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.

తెలంగాణలో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం 8.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో చూస్తే.. అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లా సముద్రాలలో 21.6, శనిగరంలో 17.2, నిర్మల్ లో 19.8. తొండకూర్ లో 16.2, అక్కెనపల్లి లో 14.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా బుధవారం పగలు మంచిర్యాల జిల్లాలోని నీల్వాయిలో 5.2, జగిత్యాల జిల్లాలో మారేడుపల్లిలో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.