సినిమా హాళ్ల ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు ఇవే …

Centre Releases SOP for Theaters to Reopen from October 15

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా దేశంలో సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 % సీటింగ్ సామర్ధ్యంతో అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులు ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో థియేటర్ల ప్రారంభంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం నాడు విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి థియేటర్ల ప్రారంభంపై మార్గదర్శకాలు తయారుచేసినట్టు పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో థియేటర్లు తెరవడానికి అనుమతించకూడదని పేర్కొన్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అదనపు చర్యలను ప్రతిపాదించవచ్చని తెలిపారు.

థియేటర్స్ ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు:

  • 50% సీటింగ్ సామర్ధ్యాన్ని మించి అనుమతించకూడదు.
  • ఆడిటోరియంలు, సాధారణ ప్రాంతాలు మరియు నిరీక్షణ ప్రాంతాలలో అన్ని సమయాల్లో కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చూడాలి.
  • ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి, ఎలాంటి లక్షణాలు లేనివారిని అనుమతించాలి.
  • థియేటర్లలో కేటాయించని సీట్లపై మార్క్ చేయాలి.
  • అన్ని సమయాల్లో ఫేస్ కవర్లు, మాస్కులు ధరించడం తప్పనిసరి.
  • హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచాలి.
  • ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోడాన్ని ప్రోత్సహించాలి.
  • టిక్కెట్స్ బుకింగ్, ఫుడ్ మరియు డ్రింక్స్ కొనుగోలులో ఆన్‌లైన్ బుకింగ్‌లు, ఇ-వాలెట్ల వాడకం వంటి డిజిటల్ లావాదేవీలను ఉపయోగించాలి.
  • కాంటాక్ట్ ట్రేసింగ్‌ దృష్ట్యా టిక్కెట్ల బుకింగ్ సమయంలో కాంటాక్ట్ నెంబర్ తీసుకోబడుతుంది.
  • దగ్గు/తుమ్ము వచ్చినపుడు ఎదుటివారి దృష్ట్యా నోరు మరియు ముక్కును కప్పి ఉంచుతూ జాగ్రత్తలు పాటించాలి.
  • ఉమ్మివేయడం పూర్తిగా నిషేధం.
  • థియేటర్లను రెగ్యులర్ గా శుభ్రం చేయడం, శానిటైజ్ చేయడం చేయాలి.
  • రద్దీని నివారించాలి, అలాగే వ్యక్తులు గుమికూడకుండా చూడాలి.
  • థియేటర్లు/మల్టీప్లెక్స్‌ల ఆడిటోరియం లోపల తగినంత భౌతిక దూరంతో సీటింగ్ ఏర్పాటు చేయాలి.
  • కోవిడ్ నివారణ, నిబంధనలపై రూపొందించిన ప్రకటనలను స్క్రీనింగ్ ముందు, ఇంటర్వెల్ సమయంలో మరియు స్క్రీనింగ్ చివరిలో ప్రదర్శించాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + two =